HYD: బీసీల ఐక్యత, హక్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈనెల 28న వనస్థలిపురంలోని డీర్ పార్క్లో బీసీ భోజనాల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమం కొనసాగుతుందని, బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.