AP: అనంతపురం జిల్లా కక్కలపల్లి మార్కెట్లో టమోటా ధరలు వారం రోజులుగా కిలో రూ.40కి పైగా పలుకుతున్నాయి. గరిష్ఠ ధర రూ.46 పలికింది. దిగుబడులు తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ప్రాంతాల్లోనూ టమోటా దిగుబడులు అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రస్తుతం టమోటాకు ధర పెరిగినట్లు తెలుస్తోంది.