TG: వార్షిక నేర నివేదికను హైదరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. ఈ ఏడాది నగరంలో నేరాలు 15 శాతం తగ్గాయని.. కానీ మహిళలపై నేరాలు పెరిగాయని అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని కేసీఆర్ చేసిన విమర్శలపై సజ్జనార్ స్పందించారు. జనాభా, వాహనాలు పెరిగినప్పుడు కొన్ని ఘటనలు సహజమన్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా అదుపు తప్పలేదన్నారు.