AP: విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రూ.3.08 కోట్ల బకాయిలు ఉన్నాయని APCPDCL చర్య తీసుకున్నట్లు సమాచారం. అయితే, భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని దేవస్థానం కోరింది. జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయం చేయనున్నట్లు తెలుస్తోంది. 2023 నుంచి బిల్లు చెల్లించలేదని, బకాయిల నోటీసులు ఇచ్చినా స్పందన లేదని విద్యుత్ శాఖ పేర్కొంది.