AP: విజయనగరం జిల్లాలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరం మండలం పురిటిపెంటలో పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. కూటమి సర్కారు హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి దూరం చేసిందని ఆరోపించారు.