AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలోని మల్లికార్జునభ్రమరాంబ స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దీంతో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు. దర్శనాల క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వరుసగా సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు.