MDCL: జీడిమెట్ల పరిధిలో గంజాయి సేవిస్తున్న స్థావరంపై మేడ్చల్ SOT పోలీసులు దాడులు చేశారు. గంజాయి సేవిస్తున్న ఆరుగురితో పాటు సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హాష్ ఆయిల్ బాక్స్, ఐదు సెల్ఫోన్లు, ఒక క్రెటా కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను జీడిమెట్ల పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.