AUS కెప్టెన్ స్టీవ్ స్మిత్ యాషెస్ చరిత్రలోనే అత్యధిక రన్స్ చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 3553 పరుగులు చేసి.. ఆలన్ బోర్డర్(3548 AUS)ను అధిగమించాడు. కాగా యాషెస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా డాన్ బ్రాడ్మన్(5028 AUS), జాక్ హాబ్స్(3636 ENG) తొలి 2 స్థానాల్లో ఉన్నారు. 5వ టెస్టులో స్మిత్ మరో 93 రన్స్ చేస్తే రెండో స్థానానికి ఎగబాకుతాడు.