AP: ఏలూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. యువత రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి సూచించారు. రోడ్డు భద్రతపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, సూరప్పగూడెం వద్ద ముగ్గురు యువకులు రాంగ్ రూట్లో వెళ్తూ మృతిచెందిన విషయం తెలిసిందే.