నల్గొండకు చెందిన నాగేంద్రమ్మ మరణించినా, ఆమె కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. లయన్స్ క్లబ్ ప్రతినిధి సూచనతో ఆమె నేత్రాలను దానం చేశారు. ఈ సాహసోపేత నిర్ణయం వల్ల ఇద్దరు వ్యక్తులకు తిరిగి చూపు లభించనుంది. విషాదంలోనూ ఇతరుల జీవితాల్లో వెలుగు నింపిన ఆ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.