KRNL: ఆదోని మండగిరి కల్వరి కొండ ప్రాంతంలో ఓ అనాథ మహిళ మృతి చెందగా, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కౌన్సిలర్ లలితమ్మ, బీజేపీ నాయకురాలు వినీత గుప్తా శుక్రవారం పోలీసులను కలిసి వివరాలు కోరారు. మృతురాలి బంధువులను గుర్తించి అంత్యక్రియల నిమిత్తం శవాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.