SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం వేకువజామునే ఆలయ అర్చకులు కాందాలై వెంకటరమణా చార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ, గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12వ పాశురాన్ని పఠించి భక్తులకు దాని విశిష్టతను వివరించారు.