గ్రేటర్ HYDలో గ్రౌండ్ వాటర్ వినియోగం పెరుగుతుండటంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు తెలిపారు. ఉప్పల్ పరిధిలో భూగర్భ జలాలు 7.6 మీటర్ల లోతులో, కుత్బుల్లాపూర్లో 18.7 మీటర్ల లోతులో, అమీర్పేట ప్రాంతంలో 10.5 మీటర్ల లోతులో ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచిస్తున్నారు.