ATP: జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న వివిధ రకాల కాలం చెల్లిన వస్తువులను వేలం వేయనున్నారు. ముఖ్యంగా మెగాఫోన్స్, బ్యాటరీలు, ఫైబర్ లాటీలు, డ్రాగన్లైట్లు వంటి సుమారు 30 వివిధ రకాల స్క్రాప్ వస్తువులను వేలం వేయ నున్నారు. ఈ నెల 29న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించనున్నారు.