మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి స్వర్గీయ నూకల రామచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి హాజరుకానున్నట్లు శనివారం ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ తెలిపారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, మాజీ ఎంపీ ఆర్. సురేందర్ రెడ్డి తదితరులు పరిశీలించారు.