VKB: చౌడాపూర్ మండలంలో చలి పంజా విసురుతోంది. మందిపల్, చౌడపూర్, కొత్తపల్లితండా, విఠలాపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి గ్రామాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం గజగజ వణుకుతున్నారు. సాయంత్రం ఆరు నుంచే చలి మొదలై తెల్లవారుజామున తీవ్రత పరాకాష్టకు చేరుతోంది. దీంతో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.