AP: శ్రీవారి దర్శనార్థం వచ్చిన సర్వదర్శన భక్తుల కష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏడాదికాలంగా 2PM సమయంలో టోకెన్లు ఇస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని 3 రోజులుగా 10AM నుంచే ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా నిన్న 7:30AMకే టోకెన్ల పంపిణీ ప్రారంభించారు. దీంతో రానున్న రోజుల్లో ఇదే విధానం అనుసరించాలని పలువురు అభిప్రాయపడ్డారు.