KRNL: ఎమ్మిగనూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్యవైశ్య సంఘం నేతలు శుక్రవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సంఘం ప్రతినిధులు మురళీకృష్ణ, వెంకటేష్ తెలిపారు.