NTR: గ్రేటర్ విజయవాడ వ్యవహారం తుది దశకు చేరడంతో, సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. డిసెంబరు 31లోపు ప్రభుత్వం జీవో జారీ చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. గ్రేటర్ హైదరాబాద్ సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చిన తరహాలోనే, ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.