MBNR: రాబోయే ఐదేళ్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన సర్పంచులు పని చేయాలని సూచించారు.