NGKL: అమ్రాబాద్ మండలంలోని ప్రశాంత్ నగర్, కలములోనిపల్లి, లక్ష్మపూర్, వంగురోనిపల్లి, కుమ్మరోనిపల్లి గ్రామాల్లో ఎస్టీ జనాభా లేకపోయినా, సర్పంచ్ పదవిని ఎస్టీలకు కేటాయించారు. దీంతో ప్రస్తుతం అయిదు గ్రామాల్లో పరిపాలన కోసం ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పరిస్థితి ఆందోళనగా మారింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.