TG: HYDలోని నల్లకుంటలో భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనపై ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య వివరాలు వెల్లడించారు. ‘త్రివేణి-వెంకటేష్ పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వెంకటేష్ తాగుడుకు బానిసయ్యాడు. త్రివేణి హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. నిద్రపోతున్న భార్యపై వెంకటేష్ పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు’ అని వివరించారు.