MULG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు శుక్రవారం 2వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దోమల నివారణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ఇది అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్వతల ఎల్లయ్య, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.