MBNR: అమృత్ భారత్ పథకంలో భాగంగా MBNR రైల్వే స్టేషన్కు అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు. 1వ నంబరు ప్లాట్ఫాం సమీపంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్టేషన్లో ఆధునిక వెయిటింగ్ హాళ్లు, మెరుగైన లైటింగ్, ఇతర మౌలిక వసతుల కల్పనకు అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ పనులను రైల్వే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.