SKLM: జిల్లా వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పలాస- కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా పలాస-కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో , తాల పధ్ర రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన తెలిపారు.