PDPL: మరణంలోనూ మరో ఇద్దరికి నేత్రదానం చేసి ఆ కుటుంబం ఆదర్శవంతమైంది. ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన నాగపురి కిష్టమ్మ అనారోగ్యంతో గురువారం మరణించింది. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు HYD- LVప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రదానం చేశారు. ఆస్పత్రి టెక్నీషియన్ గాజుల సతీష్ సహకారంతో మృతురాలు కార్నియా సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంకుకు తరలించారు.