ప్రకాశం: మర్రిపూడి మండలం తంగేళ్ల దగ్గర శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వెనక నుంచి మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై వెళుతున్న డేవిడ్ అనే వ్యక్తి అక్కడక్కడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.