BDK: ఇటీవల జరిగిన 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలలో భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం దాసు తండా గ్రామ పంచాయతీ ఎన్నికలలో భూక్య చందర్ సింగ్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇవాళ ఆయన్ను ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘ నాయకులు, తెలంగాణ గిరిజన శక్తి నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు పాల్గొన్నారు.