NRPT: ఊట్కూర్ మండలంలోని పెద్ద పొర్ల గ్రామంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామ ప్రజలందరూ పరిసర ప్రాంతాలలో వీటి నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. పందుల పరిసర ప్రాంతమంతా దుర్గంధం వ్యాపించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉన్నతాధికారులైన తగిన చర్యలు తీసుకోగలరని స్థానికులు కోరుతున్నారు.