NGKL: జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.