NLG: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీ.ఓ 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 న కలెక్టరేట్ల ముందు జరిగే నిరసనను జయప్రదం చేయాలని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లోజు శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కొత్త జీవో జర్నలిస్టులను గందరగోళానికి గురి చేస్తుందని పేర్కొన్నారు.