ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం వ్యవస్థాపకుడు, CEO పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. 37ఏళ్ల లోపు మహిళలు తన వీర్యం వాడుకుని IVF చేయించుకుంటే తానే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు. గత 15ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా తన వీర్యదానంతో దాదాపు 100 మంది పిల్లలు జన్మించారని, వారికి తన సంపదను సమానంగా పంచుతానని ఇప్పటికే ఆయన ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఆయన సంపద 14-17 బిలియన్ డాలర్లుగా ఉంది.