ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద బైక్ను రైలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.