SRPT: ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చర్చ్లన్నీ ఘన ఏర్పాట్లు చేస్తున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని ప్రతీకగా చర్చ్‌లను రంగురంగుల కాంతులు, క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, పశువుల పాకలతో సుందరంగా అలంకరించారు. లోకానికి వెలుగైన క్రీస్తును ఆరాధించే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సన్నదం అయ్యారు.