E.G: భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని వాజ్పేయి విగ్రహం దగ్గర దీపాలు వెలిగించారు. వాజ్పేయి ఆశయాలు పీఎం మోదీతోనే సాధ్యమన్నారు.