E.G: ఏపీ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడుని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి వెళ్లారు. ఆయా సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.