TG: KCRపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ‘నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు దివాళాకోరు రాజకీయాలకు మిగిలేది దిక్కుమాలిన వ్యక్తిగత దూషణలు మాత్రమే. ఇచ్చిన హామీల అమలుపై ధ్యాస లేనప్పుడు, ప్రతిపక్ష నిలదీతకు సమాధానం చెప్పలేక వచ్చేవి ఇలాంటి రోత మాటలే. రేవంత్ రెడ్డికి 2028 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు’ అంటూ విమర్శించారు.