MNCL: నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నాకాబందీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 31, జనవరి 1 వరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.