NGKL: ఈనెల 25 నుంచి 28 వరకు కరీంనగర్లో నిర్వహించనున్న 72వ సీనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు బుధవారం వెళ్లారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికైన ఈ జట్టుకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య ఘనంగా వీడ్కోలు పలికారు.