MDK: మెదక్ పట్టణంలోని ప్రసిద్ధ మెదక్ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చర్చి పరిసరాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ ప్రాంతాలు, రహదారులపై అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు.