MLG: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శాశ్వత అభివృద్ధికి భూములిచ్చిన మేడారం గ్రామస్థులకు ఇవాళ MLG కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులు అందజేశారు. భూములిచ్చిన గ్రామస్థులకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపి, భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.