MHBD: సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DSP తిరుపతిరావు అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం కురవి మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DSP పాల్గోని విద్యార్థులకు సూచనలు చేశారు.