కృష్ణానది సంగమ ప్రాంతమైన హంసలదీవి తీరం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. క్రిస్మస్ పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. సముద్ర అలల ఉద్ధృతి దృష్ట్యా లోపలికి వెళ్లవద్దని, చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలు జరగకుండా తీరం వెంబడి నిఘా ఏర్పాటు చేశారు.