కృష్ణా: అవనిగడ్ట నియోజకవర్గ కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నూతన కమిటీని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి పలువురు నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా అనుభవం, సేవాభావం కలిగిన నాయకులను కమిటీలోకి ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.