NGKL: అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ భూములను అక్రమ కబ్జాల నుంచి రక్షించాలని బీజేపీ పట్టణ శాఖ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవో యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. కొందరి అక్రమ చర్యలతో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని, అధికారులు వెంటనే సర్వే నిర్వహించి కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.