SDPT: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దౌల్తాబాద్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రీ- క్రిస్మస్ వేడుకల్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కలిసి మతసామరస్యంతో ఉండాలన్నారు.