AP: ఏలూరు జిల్లా పెనుమాకలంకలో విషాదం చోటుచేసుకుంది. తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన తల్లి పార్వతి, కుమార్తె నాగమణి కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు కాస్త తీవ్రం కావడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.