సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ప్రసిద్ధ రేచింతల్ సిద్ధివినాయక స్వామి వారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆశీర్వాదాలు అందజేశారు. హరీష్ రావు వెంట ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.