AP: కృష్ణా జిల్లా నందిగామాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. విషపుకాయలు తిని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాదం కాయలు అనుకుని తినడంతో వారంతా వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. ఈ మేరకు వారిని వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే వారు అవి విషపు కాయలని తెలియక తిన్నారా? తెలిసే తిన్నారా? అనేది తెలియాల్సి ఉంది.