NZB: బీజేపీ సీనియర్ నాయకుడు పుప్పాల శివరాజ్ సోదరుడు, మున్నూరు కాపు సదర్ పుప్పాల గిరిధర్ ఆకస్మిక మృతి పట్ల ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. గిరిధర్ నిబద్ధత గల వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.